Tuesday, November 6, 2012

అదే ఆదరణ, ఆత్మీయత!

అచ్చం మహానేత రాజన్నను తలపించే రీతిలో చిరునవ్వుతో షర్మిల ప్రజలతో మమేకమవ్వడం అందర్ని ఆకట్టుకుంటోంది. అక్కా.. అన్నా.. అవ్వా.. తాతా అంటూ ఆత్మీయంగా పలకరించడం ..


అచ్చం మహానేత రాజన్నను తలపించే రీతిలో చిరునవ్వుతో షర్మిల ప్రజలతో మమేకమవ్వడం అందర్ని ఆకట్టుకుంటోంది. అక్కా.. అన్నా.. అవ్వా.. తాతా అంటూ ఆత్మీయంగా పలకరించడం .. కష్టనష్టాలను తెలుసుకునే తీరు ప్రజల్ని దగ్గర చేస్తోంది. ‘ఇప్పుడు రాబందుల రాజ్యం నడుస్తోంది.. కొన్నాళ్లు ఓపిక పట్టండి.. రాజన్న రాజ్యం వస్తుంది.. జగనన్న సీఎం అవుతారు.. అందరి కష్టాలను తీరుస్తారు’ అంటూ ధైర్యం చెప్పే తీరు ప్రజలందరిలోనూ భరోసా నింపుతోంది.

మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల 'మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో ప్రజా సమస్యలపై దృష్టిసారిస్తున్న తీరు సీనియర్ నాయకులను సైతం ఆశ్చర్యపరుస్తొంది. ఈ పాదయాత్రకు హాజరవుతున్న భారీ జనసందోహం మధ్య షర్మిల రైతుల, గ్రామీణ ప్రజల, విద్యార్థుల, వృద్దుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా అచ్చం రాజన్న మాదిరే అందరినీ కలుపుకొని పోతూ.. జగనన్న మాదిరే అండగా నిలుస్తానని ధైర్యం చెబుతూ వస్తున్న షర్మిల ఒక్కొక్క అడుతూ వైఎస్ఆర్ కాంగ్రెసేతర రాజకీయ పార్టీల్లో గుబులు రేపుతోంది. రోజురోజుకూ జారిపోతున్న తమ ఎమ్మెల్యేలకు తోడు.. షర్మిల పాదయాత్రకు అశేషంగా లభిస్తున్న ప్రజాభిమానం ఆయా పార్టీల నేతల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

పేదల పక్షపాతిగా అడుగు వేస్తూ.. జగనన్న సారథ్యంలో రాజన్న సురాజ్య స్థాపనే ధ్యేయంగా అశేష ప్రజాభిమానంతో ముందుకు నడుస్తున్న షర్మిల పాదయాత్రతో.. సంక్షేమ పథకాల్లో ప్రభుత్వ చేతగాని తనాన్ని ప్రజలు స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నారు. కుటిల రాజకీయ యత్నాలను ప్రజలు గమనించలేరనుకుంటున్న కుమ్మక్కు రాజకీయ కుతంత్రాలను.. షర్మిల తన ప్రసంగంలో వెలిబుచ్చుతున్న తీరుకు తలపండిన నాయకులు కూడా ఆశ్చర్యం వెలిబుచ్చుతున్నారు. ప్రజలనే కుటుంబంలో తనూ ఒక కుటుంబ సభ్యురాలిగా మాట్లాడుతూ.. మహిళల సాధికారతకూ, రైతుల సంక్షేమానికీ అండగా ఉంటానని చెబుతున్న తీరు జనాల్లో నమ్మకాన్ని, అంతులేని ఆత్మ స్థైర్యాన్ని కలిగిస్తోంది. ఇలా రైతులు, మహిళలు, విద్యార్థులు, కుల సంఘాలు తమ సమస్యలను షర్మిలతో పంచుకోవడం చూస్తే .. ఈ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. ఈ సందర్భంగా.. 'జనం అష్టకష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై ప్రజల కోసం పోరాడుతోన్న జగనన్నపై అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా జైలుకు పంపారు. జగనన్నను ఆశీర్వదించండి. రానున్న రోజుల్లో వైఎస్ ఇచ్చిన ప్రతి హామీ అమలవుతుంది.. అన్ని వర్గాల ప్రజలకూ మంచి జరుగుతుంది’ అంటూ ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ , పావలా వడ్డీ లాంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై.. ప్రతిపక్షపార్టీ అనుసరిస్తున్న విధానాలపై షర్మిల సమయాన్ని బట్టి స్పందిస్తున్నారు. వైఎస్ఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై చూపిన ఆదరణ, అభిమానాన్ని షర్మిలపై చూపిస్తున్నారు. నిజాయితీ, విశ్వసనీయత ఉంటే ప్రజల్ని దూరం చేయడం ఎవరి తరం కాదని మరో ప్రజాప్రస్థానం రుజువు చేస్తోంది. ఇందుకు అనంతపురంలో నిర్వహించిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ప్రతి రోజు, ప్రతి చోట ప్రజలు బ్రహ్మరంధం పట్టిన తీరే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పాదయాత్ర అనంతపురంలో గురువారం ముగిసి కర్నూలు జిల్లాలో ప్రారంభం కానుంది. షర్మిలకు సాదర స్వాగతం పలికేందుకు కర్నూలు ప్రజానీకం కూడా ఆతృతగా ఎదురుచూస్తోంది.


 జై జగన్ జోహార్  వై.యస్.ఆర్

like us on facebook @ www.facebook.com/ysrcpegdt

No comments:

Post a Comment